AP News: నేడు సచివాలయంలో ఏపీ తొలి మంత్రివర్గ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం  వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే.

Published : 24 Jun 2024 10:26 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం  వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. సోమవారం నాటి మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు