Lok Sabha: 18వ లోక్‌సభ తొలి సెషన్‌ సమావేశాలకు సర్వం సిద్ధం

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో 24, 25 తేదీల్లో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Published : 23 Jun 2024 20:04 IST

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో 24, 25 తేదీల్లో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చ ఉంటుంది. జులై 2 లేదా 3న ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చకు బదులిచ్చే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని