Ap News: హోంమంత్రి వంగలపూడి అనితకు మత్స్యకారుల వినతి

వైకాపా పాలనలో తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ బాపట్ల జిల్లా మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనితకు వినతిపత్రం సమర్పించారు.

Updated : 21 Jun 2024 19:45 IST

వైకాపా పాలనలో తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ బాపట్ల జిల్లా మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనితకు వినతిపత్రం సమర్పించారు. చీరాల వెళ్తున్న హోంమంత్రి బాపట్ల జిల్లా మత్స్యకారులు చేతిలో వినతిపత్రం చూసి కాన్వాయ్ ఆపి వారిని కలిశారు. వైకాపా పాలనలో తమను కొట్టి జైళ్లు, కోర్టుల వెంబడి తిప్పారంటూ.. అనిత వద్ద మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను.. గ్రామ సమస్యగా మార్చి గ్రామస్థులపై అక్రమ కేసులు పెట్టారని అనితకి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై బాపట్ల జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన హోం మంత్రి.. సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు