Jeevan Reddy: ఫ్లెక్సీల తొలగింపుపై తీవ్ర మనస్థాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బొమ్మతో ఉన్న ప్లెక్సీల తొలగింపుపై తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated : 05 Jul 2024 12:18 IST

జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బొమ్మతో ఉన్న ప్లెక్సీల తొలగింపుపై తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాల పండగలో పాల్గొనేందుకు వెళ్లి వస్తుండగా 8వ వార్డులో పెట్టిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగిస్తుండగా జీవన్ రెడ్డి గమనించారు. ప్లెక్సీని ఎవరు తీయమన్నారని ప్రశ్నించగా.. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తీయమంటే తీస్తున్నామంటూ సిబ్బంది చెప్పారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లెక్సీలోని ఉద్యోగుల ఫొటోకు మాస్క్ వేయాలని మాత్రమే సూచించానని మున్సిపల్ టీపీఎస్‌ తేజస్విని బదులిచ్చారు.

Tags :

మరిన్ని