Pullela Gopichand: క్రీడాకారులు నాణ్యమైన, శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి: పుల్లెల గోపిచంద్

ఆహారనియమాలు పాటించి నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ధృడంగా ఉండొచ్చని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు.

Updated : 14 Jun 2024 16:26 IST

ఆహారనియమాలు పాటించి నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ధృడంగా ఉండొచ్చని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ (Pullela Gopichand) అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఫుడ్ అఫైర్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను గోపిచంద్ ప్రారంభించారు. క్రీడాకారులు శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత విభాగం అధికారుల దాడులు మంచిదేనని గోపీచంద్ అభిప్రాయపడ్డారు. నాణ్యమైన ఆహారం వినియోగదారుల హక్కు అని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లు రుచికరమైన ఆహార ఉత్పత్తులను అందుబాటులో ఉంచాయి. ఈ నెల 15వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

Tags :

మరిన్ని