Ramoji Rao: రామోజీరావుకు మాజీ వ్యాఖ్యాతలు నివాళులు

రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల తెలుగువారే కాదు.. తెలుగు భాష సైతం బాధపడుతోందని ఈటీవీ మాజీ వ్యాఖ్యాతలు అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు.

Updated : 17 Jun 2024 10:16 IST

రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల తెలుగువారే కాదు.. తెలుగు భాష సైతం బాధపడుతోందని ఈటీవీ మాజీ వ్యాఖ్యాతలు అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. జీవితంలో ఈటీవీతో అనుబంధాన్ని సాగించి, అనేక పాఠాలు నేర్చుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయా టీవీ ఛానల్‌తో పాటు ఎక్కడికి వెళ్లినా తమ వాచకాన్ని చూసి ఈటీవీలో పనిచేశారని గుర్తిస్తున్నారని అన్నారు. అంతటి విశ్వసనీయత కేవలం ఈటీవీకే సాధ్యమని అన్నారు. ఈటీవీని ఆ స్థాయిలో నిలబెట్టిన స్వర్గీయ రామోజీరావు సదా స్మరణీయులని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని