APSRTC: ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు

ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం అవుతోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పడు వస్తుందా అని మహిళలు, యువతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Published : 20 Jun 2024 15:13 IST

ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం అవుతోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పడు వస్తుందా అని మహిళలు, యువతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే సీఎంగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు.. 5 ముఖ్యమైన హామీలైన మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్ పెంపు, నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధణ మీద సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణ సౌకర్యం త్వరలో అమలు చేయనున్నట్లు  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. మరి, ప్రజా రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీకి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ఈ పథకం ఎప్పట్నుంచి, ఎలా మహిళలకు అందుబాటులోకి రానుంది?

Tags :

మరిన్ని