AP News: ఏపీవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో..సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్‌ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Published : 08 Jul 2024 10:08 IST

ఏపీవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో..సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్‌ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను విక్రయించి చెల్లింపులను నగదు రూపంలో తీసుకుని పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడింది. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులోనూ ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్‌ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ, పారదర్శక విధానం అమలు చేయనుంది.

Tags :

మరిన్ని