Amaravati: అమరావతి రైల్వేలైన్‌కు ఎట్టకేలకు కదలిక

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం గడిచిందో లేదో.. రైల్వేశాఖ ఆఘమేఘాలపై దిగొచ్చింది. ఉరుకులు పరుగులతో అమరావతి రైల్వే లైన్‌ భూసేకరణకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Updated : 21 Jun 2024 10:18 IST

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం గడిచిందో లేదో.. రైల్వేశాఖ ఆఘమేఘాలపై దిగొచ్చింది. ఉరుకులు పరుగులతో అమరావతి రైల్వే లైన్‌ భూసేకరణకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఏ సంస్థలైనా ముందుకొచ్చి పనిచేసేందుకు క్యూ కడతాయి అనేందుకు ఇదే ఉదాహరణ. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్లపాటు ఉలుకు పలుకు లేకుండా ఉన్న రైల్వేశాఖ.. చంద్రబాబు సీఎం కావడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై దృష్టిపెట్టడంతో.. వెంటనే అక్కడి కొత్త రైల్వేలైన్‌కు క్లియరెన్స్‌లు ఇచ్చేందుకు సిద్ధమైంది. గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి, భూసేకరణ వ్యయం భరించాలనే కొర్రీలతో కాలయాపన చేసిన రైల్వే ఇప్పుడవేమీ లేకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకొచ్చింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా దీనిని ప్రత్యేక ప్రాజెక్ట్‌గా గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు