TG News: నేడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ 9వ కౌన్సిల్ సమావేశం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదో కౌన్సిల్ సమావేశం ఇవాళ జరుగనుంది.

Published : 06 Jul 2024 10:00 IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదో కౌన్సిల్ సమావేశం ఇవాళ జరుగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో అధికార, విపక్ష కార్పొరేటర్ల మధ్య వాడీవేడిగా చర్చ జరగనుంది. మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్, మరికొంత మంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్ భేటీ రసవత్తరంగా మారనుంది. భారాసను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని.. గ్రేటర్ హైదరాబాద్ భారాస ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. 

Tags :

మరిన్ని