USA: జెయింట్ లోలకంలో సాంకేతిక సమస్య.. తలకిందులుగా వేలాడిన 28మంది రైడర్లు

అమెరికా ఓరెగన్‌లోని వందేళ్లనాటి ఉద్యానవనంలో సందర్శకులకు భయానక అనుభవం ఎదురైంది.

Updated : 15 Jun 2024 20:07 IST

అమెరికా ఓరెగన్‌లోని వందేళ్లనాటి ఉద్యానవనంలో సందర్శకులకు భయానక అనుభవం ఎదురైంది. ఓక్స్ పార్క్‌లోని హర్రర్ రైడ్ చేసేందుకు పలువురు ఔత్సాహికులు యత్నించారు. ఈ రైడ్‌లో లోలకం ఆకారంలో ఉన్న భారీ పరికరం వారిని ఎత్తుకు తీసుకెళ్లి.. కిందికి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ.. జెయింట్ లోలకంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైనే ఆగిపోయింది. 28మంది రైడర్లు తల కిందులుగా వేలాడుతూ.. 30 నిమిషాలు భయం గుప్పిట్లో గడిపారు. వెంటనే సహాయక సిబ్బంది రంగంలో దిగి వారందరినీ సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు పార్కు యాజమాన్యం తెలిపింది. వారిలో ఒకరు స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు