Yadadri: యాదాద్రిలో వైభవంగా సాగిన ‘గిరి ప్రదక్షిణ’

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది.

Published : 18 Jun 2024 15:35 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.

Tags :

మరిన్ని