Polavaram: పోలవరంలో సీపేజిని పూర్తిగా నిరోధించలేం: నిపుణుల బృందం

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న సీపేజిని పూర్తిగా నిరోధించడం అసాధ్యమని విదేశీ నిపుణుల బృందం తేల్చిచెప్పింది.

Published : 11 Jul 2024 09:29 IST

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న సీపేజిని పూర్తిగా నిరోధించడం అసాధ్యమని విదేశీ నిపుణుల బృందం తేల్చిచెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే ఆ నీటిని కొంత గ్రావిటీ ద్వారా బయటకు పంపాలని పేర్కొంది. మిగిలిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడమే మార్గమని తేల్చిచెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే +17 మీటర్ల కన్నా దిగువకు మాత్రమే సీపేజి నీటిని అనుమతించాలని, అంతకు పైన ఉన్న నీటినంతా బయటకు పంపాల్సిందేనని స్పష్టం చేసింది. విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఇందులో కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత ఇచ్చింది.

Tags :

మరిన్ని