Paddy Cultivation: వరి సాగులో సవాళ్లు.. ఇవీ పరిష్కారాలు!

ప్రపంచంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. భారత్ సహా అన్ని దేశాల్లో ఏటికేడు జనాభా శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ఆహార పంట వరి ఉత్పత్తులకు డిమాండ్ అధికమవుతోంది. ఈ కారణం వల్లే ప్రపంచంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయి.

Published : 12 Jun 2024 19:15 IST

ప్రపంచంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. భారత్ సహా అన్ని దేశాల్లో ఏటికేడు జనాభా శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ఆహార పంట వరి ఉత్పత్తులకు డిమాండ్ అధికమవుతోంది. ఈ కారణం వల్లే ప్రపంచంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. అటు భారత్‌లో వరి పంట సాగు, విస్తీర్ణం, బియ్యం ఉత్పత్తికి పుష్కలమైన నేలలు, నీటి వనరులు, విదేశీ ఎగుమతులకు అపారమైన అకాశాలు ఉన్నా నాణ్యత పెద్ద సవాల్‌గా మారింది. భారత్ బియ్యానికి ఇతర దేశాల్లో ఆదరణ ఉండడం లేదు. ఇలాంటి సవాళ్ల పరిష్కారానికి హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కమోడిటీ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ) ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగిసింది. ప్రపంచంలో ప్రత్యేకించి భారతదేశంలో వరి పరిశోధనలు, సాగు, ఉత్పత్తి, ఉత్పాదతక, నాణ్యత, ఎగుమతుల పెంపుపై సదస్సులో విస్తృతంగా చర్చించారు.

Tags :

మరిన్ని