Amaravati: రాజధానికి కొత్త ఊపిరి.. మూడు రోజులుగా జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు

నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం అమరావతి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.

Published : 12 Jun 2024 10:15 IST

నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం అమరావతి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఐదేళ్లుగా రక్కసి చేతుల్లో పడి నలిగిపోయిన ప్రజా రాజధాని కూటమి గెలుపుతో ఇప్పటికే ఊపిరి పోసుకుంది. అధికార యంత్రాంగం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడంతో పట్టిన గ్రహణం వీడి కొత్త కళ సంతరించుకుంది. ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, అభివృద్ధి పనులతో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రజలు సగర్వంగా తలెత్తుకుని చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని రాజధాని రైతులు చెబుతున్నారు.

Tags :

మరిన్ని