Buchaiah Cowdary: ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్న గోరంట్ల బుచ్చయ్య..!

తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

Published : 19 Jun 2024 12:10 IST

తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని బుచ్చయ్య చౌదరిని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్‌ చేసి కోరారు. ఇందుకు ఆయన అంగీకరించారు. రేపు గవర్నర్ అబ్దుల్ నజీర్.. బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్, జగన్ సహా ఎన్నికైన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు.

Tags :

మరిన్ని