Bhatti: ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటాం: మంత్రి భట్టి

ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతీ పైసాకు జవాబుదారీ తనంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 13 Jun 2024 12:33 IST

ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతీ పైసాకు జవాబుదారీ తనంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఏడాదిన్నరలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగు నీరంందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రులు తుమ్మల, నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి విద్యాశాఖ, నీటిపారుదలశాఖలపై భట్టి సమీక్ష నిర్వహించారు. విద్యారంగాన్ని గాడిన పెట్టెందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం పాతబస్టాండును సందర్శించిన భట్టి.. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. 

Tags :

మరిన్ని