crop Loan Waiver scheme: దశలవారీగా రైతు రుణమాఫీ అమలు!

వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 20 Jun 2024 14:58 IST

వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 15 కల్లా రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులతోనూ, మంత్రివర్గ సహచరులతోనూ దీనిపై విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసిన ప్రభుత్వం, రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Tags :

మరిన్ని