Punganur: ఒక్క ఉత్తర్వుతో.. రూ. 100 కోట్ల విలువైన భూములు కొట్టేశారు..!

చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములు.. వైకాపాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ‘పెద్దాయన’ అనుచరుల చేతుల్లోకి వెళ్లాయి.

Published : 09 Jul 2024 12:16 IST

చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములు.. వైకాపాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ‘పెద్దాయన’ అనుచరుల చేతుల్లోకి వెళ్లాయి. ఒకటీ రెండూ కాదు.. పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల భూములు.. మొత్తంగా వాటి విలువ రూ.100 కోట్లకు పైనే. రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం (ప్రభుత్వ భూములు) పేరుతో నమోదైన ఆ భూముల్ని.. గతంలో పనిచేసిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కాపాడుతూనే వచ్చారు. కానీ వైకాపా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మాత్రం ‘పెద్దాయన’ అండ చూసుకుని రెచ్చిపోయారు. వైకాపా ప్రభుత్వంలో అధికారులు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని భూములు దోచుకోవటానికి వారికి సహకరించారు. ప్రభుత్వం మారినా వారు మాత్రం వైకాపా విధేయులుగానే కొనసాగుతున్నారు.

Tags :

మరిన్ని