NEET UG: నీట్‌ కౌన్సెలింగ్‌పై స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు

వైద్య విద్య కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నీట్‌లో అక్రమాలు వెల్లువెత్తినట్లు ఆరోపణలు రావడంతో గ్రేస్ మార్కులను కేంద్రం రద్దు చేయనుంది.

Published : 13 Jun 2024 20:07 IST

వైద్య విద్య కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నీట్‌లో అక్రమాలు వెల్లువెత్తినట్లు ఆరోపణలు రావడంతో గ్రేస్ మార్కులను కేంద్రం రద్దు చేయనుంది. అదనపు మార్కులు పొందిన 1563మంది అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించి.. జూన్ 30లోపు ఫలితాలు వెల్లడిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషనపై ఎన్‌టీఏకు నోటీసులు జారీచేసిన సర్వోన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. నీట్ కౌన్సిలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది.

Tags :

మరిన్ని