Hanuman Jayanti: తిరుమలలో వైభవంగా హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

తిరుమలలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలను తితిదే వైభవంగా నిర్వహించింది. జపాలి తీర్థంలోని హనుమంతుడికి అభిషేకాలు, నివేదనలు నిర్వహించారు. జపాలిలోని హనుమంతుడికి తితిదే తరఫున ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Updated : 01 Jun 2024 16:27 IST

తిరుమలలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలను తితిదే వైభవంగా నిర్వహించింది. హనుమంతుడు జన్మస్థలంగా ప్రకటించిన అంజనాద్రిలో ఉదయం బాల ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జపాలి తీర్థంలోని హనుమంతుడికి అభిషేకాలు, నివేదనలు నిర్వహించారు. జపాలిలోని హనుమంతుడికి తితిదే తరఫున ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటి ఘాటు రోడ్డులోని ఏడో మైలురాయి వద్ద ప్రసన్న ఆంజనేయ స్వామివారికి పూజలు చేశారు. తిరుమలలో ఈ నెల 5 వరకు హనుమాన్‌ జయంతి ఉత్సవాలను తితిదే ఘనంగా నిర్వహించనుంది.

Tags :

మరిన్ని