Hathras Stampede:: భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న దేవ్ ప్రకాశ్ మధుకర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Published : 05 Jul 2024 18:26 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న దేవ్ ప్రకాశ్ మధుకర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. యూపీతో పాటు పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్, హరియాణాలో  విస్తృతంగా గాలిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువు సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ కూడా ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. భోలో బాబా ఆచూకీ లభిస్తే ఆయన్నీ ప్రశ్నిస్తామని చెప్పారు. మరోవైపు భోలే బాబాకు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Tags :

మరిన్ని