Rain in Hyderabad: భాగ్యనగరంలో కుండపోత.. ఎల్బీనగర్‌ ప్రాంతంలో రోడ్లు జలమయం

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భాగ్యనగరంలో పలు చోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.

Published : 23 Jun 2024 16:56 IST

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భాగ్యనగరంలో పలు చోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా.. మరోవైపు రోడ్డుపై వరదనీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. చింతల్‌కుంట వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరదనీటిలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి.

Tags :

మరిన్ని