Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Updated : 23 Jun 2024 19:50 IST

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. చాదర్‌ఘాట్‌లో కురిసిన వర్షానికి మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్‌, సైదాబాద్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, సరూర్‌నగర్‌, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, బోరబండ, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Tags :

మరిన్ని