Vijayawada: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం.. విజయవాడలో భారీగా ట్రాఫిక్ జామ్‌

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు విజయవాడకు తరలివచ్చారు.

Updated : 12 Jun 2024 13:27 IST

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు విజయవాడకు తరలివచ్చారు. అన్ని ప్రాంతాల దారులన్నీ బెజవాడవైపే సూచించాయి. విజయవాడకు వచ్చే వేలాది మందితో జాతీయ రహదారులపై కి.మీ. మేర వాహనాలు బారులు తీరాయి. లెక్కకు మించి వచ్చిన వాహనాలతో కేసరపల్లి నుంచి వారధి వరకు భారీగా ట్రాపిక్ జామ్‌ అయింది. దీంతో తమ అభిమాన నేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని కళ్లారా చూద్దామని వ్యయ ప్రయాసల కోర్చి వచ్చిన వేలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా చూడలేకపోయారు. ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో తీవ్ర నిరాశకులోనై తిరుగు పయనమయ్యారు.

Tags :

మరిన్ని