Vangalapudi Anitha: గ్రామాల్లో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు: హోం మంత్రి అనిత

గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు హోం మంత్రి అనిత (Vangalapudi Anitha) తెలిపారు.

Published : 05 Jul 2024 17:50 IST

గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు హోం మంత్రి అనిత (Vangalapudi Anitha) తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల పరిసరాల్లో గంజాయి తాగి అమ్మాయిలను వేధిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని వంటశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం రుచి చూశారు. బాలికల ఉన్నత పాఠశాలలో పర్యటించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

Tags :

మరిన్ని