TIDCO Houses: టిడ్కో ఇళ్ల కోసం హడ్కో సమ్మతి

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి.

Published : 08 Jul 2024 10:46 IST

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతో అప్పట్లో రుణాలిచ్చేందుకు హడ్కో, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తంచేసింది. రూ.2వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

Tags :

మరిన్ని