Raghurama: జగన్‌ సొంతానికి వాడుకున్న ఫర్నీచర్‌ను తిరిగిచ్చేయాలి: రఘురామ

ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చేసుకొని కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల రాజభోగాలు అనుభవించారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

Updated : 16 Jun 2024 15:14 IST

ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చేసుకొని కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల రాజభోగాలు అనుభవించారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ప్రజాధనంతో విలాసవంతమైన ఫర్నీచర్ కొనుగోలు చేసి సొంతానికి వాడుకున్నారన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనందున జగన్‌ ఫర్నీచర్‌ను తిరిగి ఇచ్చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. ఐదేళ్లలో విలాసాల కోసం రూ.45 కోట్లు ఖర్చు చేసిన జగన్.. ఆ సొమ్మంతా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని కోరారు.

Tags :

మరిన్ని