AP News: గ్రావెల్‌ గజదొంగల గుట్టువిప్పే పనిలో అధికారులు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదేళ్లపాటు సాగిన మట్టి దందాపై గనుల శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు.

Published : 19 Jun 2024 11:47 IST

కొండలు కొల్లగొట్టారు. పోలవరం కాలువ కట్టలు కరిగించేశారు. అటవీ, అసైన్డ్ భూముల్ని గుల్లచేశారు. ఆఖరికి చెరువులనూ ఛిద్రం చేశారు. అదేమని అడిగితే.. జగనన్న కాలనీల కోసమని ముసుగుతొడిగారు. రోడ్ల నిర్మాణం కోసమంటూ నమ్మిచే ప్రయత్నం చేశారు. అయితే లక్షల కోట్ల ఘనపు మీటర్ల మట్టితో ఏ కాలనీని మెరకచేశారు? ఎక్కడెక్కడ రోడ్లు వేశారు? అనుమతులు తీసుకున్నదెంత? తవ్వేసిందెంత? ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదేళ్లపాటు సాగిన మట్టి దందాపై గనుల శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. మట్టి తవ్వకాలు, ఆదాయ తీరు తెన్నులపై అధికారులు దస్త్రాలు తిరగేస్తున్నారు. 

Tags :

మరిన్ని