TS News: బగ్గా డిస్టిలరీలో అక్రమ మద్యం తయారీ..

తెలంగాణలో బగ్గా డిస్టిలరీ మద్యం తయారీ పరిశ్రమలో పర్యవేక్షణ విధులకు వెళ్లాలంటే ఎక్సైజ్ అధికారులు సాహసించలేని పరిస్థితి.

Published : 22 Jun 2024 10:18 IST

తెలంగాణలో బగ్గా డిస్టిలరీ మద్యం తయారీ పరిశ్రమలో పర్యవేక్షణ విధులకు వెళ్లాలంటే ఎక్సైజ్ అధికారులు సాహసించలేని పరిస్థితి. అధికారుల కళ్లుగప్పి అక్రమ మద్యం తయారు చేస్తున్న ఉదంతాలు తరచూ బయట పడుతున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు మార్లు అక్రమ మద్యం కేసుల్లో పర్యవేక్షణ సక్రమంగా లేదంటూ నలుగురు ఎక్సైజ్  అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం నిఘా ఉన్నా ఈ డిస్టిలరీలో ఎక్కడో ఒకచోట అక్రమాలకు తెరతీస్తారన్న అభిప్రాయం ఎక్సైజ్  అధికారుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా 100 కార్టన్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. లెక్కల్లోకి రాకుండా డిస్టిలరీ బయటకు తరలించిన మద్యంపై ఆరా తీస్తున్నారు.

Tags :

మరిన్ని