India-Canada: ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి కెనడా నివాళులు.. భారత్ గట్టి కౌంటర్!

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా కెనడాలో ట్రూడో సర్కారు ప్రత్యేకంగా నివాళులర్పించింది. ఆ దేశ పార్లమెంటులో సంతాప కార్యక్రమం నిర్వహించింది. ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి కెనడా నివాళులర్పించడంతో భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

Published : 19 Jun 2024 16:55 IST

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా కెనడాలో ట్రూడో సర్కారు ప్రత్యేకంగా నివాళులర్పించింది. ఆ దేశ పార్లమెంటులో సంతాప కార్యక్రమం నిర్వహించింది. ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి కెనడా నివాళులర్పించడంతో భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై ఖలిస్థానీ ఉగ్రవాది జరిపిన బాంబు దాడిలో మృతిచెందిన 329 మందికి ఈ నెల 23న నివాళులర్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కెనడాలోని ఇండియా కాన్సులేట్ జనరల్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు