chenab: చీనాబ్‌ వంతెనపై రైలు పరుగులు.. త్వరలో సేవలు అందుబాటులోకి

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన (Chenab Rail Bridge)పై తొలిసారిగా ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది.

Published : 20 Jun 2024 19:16 IST

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన (Chenab Rail Bridge)పై తొలిసారిగా ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై రైలు ట్రయల్‌ రన్‌ (Train Trail Run)ను గురువారం విజయవంతంగా నిర్వహించారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంగల్డన్‌ నుంచి రియాసీ వరకు రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. మధ్యలో చీనాబ్‌ నది (Chenab River)పై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్‌పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Tags :

మరిన్ని