ఉద్యోగాల పేరుతో సైబర్‌ మోసాలు.. కంబోడియాలో భారతీయుల బాధలు

కంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో క్రిప్టోకరెన్సీ దందా బహిర్గతమైంది.

Updated : 10 Jul 2024 10:05 IST

కంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో క్రిప్టోకరెన్సీ దందా బహిర్గతమైంది. భారత్ నుంచి ఉద్యోగాల పేరిట యువకులను రప్పించుకుంటున్న నేరస్థులు క్యాంపుల్లో బలవంతంగా పెట్టి మోసాలు చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా వందలాది మంది భారత యువకులు ఇప్పటికీ శిబిరాల్లోనే చిక్కుకుపోయారు. ఇటీవలే తిరిగి ఇంటికి చేరుకున్న జగిత్యాల యువకుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేయడంతో అక్కడి దందాలు మరోసారి బహిర్గతమయ్యాయి.  

Tags :

మరిన్ని