Hyderabad: హైదరాబాద్‌లో అంతరాష్ట్ర దొంగల హల్‌చల్‌

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి. ధార్, భవారియా, పార్సీ, చెడ్డీ వంటి ముఠాల కదలికలు కలకలం రేపుతున్నాయి.

Published : 19 Jun 2024 13:39 IST

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి. ధార్, భవారియా, పార్సీ, చెడ్డీ వంటి ముఠాల కదలికలు కలకలం రేపుతున్నాయి.  తాజాగా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే గేటెడ్ కమ్యూనిటీలోని 5 ఇళ్లల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు తెగబడింది. దోపిడీల్లో రాటుదేలిన ఈ ముఠా చాలా ఏళ్ల తర్వాత నగరంలోకి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే తరహాలో చెడ్డీ, పార్సీ ముఠాలు చోరీలు చేస్తున్నాయి. మరో వైపు భవారియా ముఠా మహిళల మెడలో నుంచి విలువైన బంగారు గొలుసులు తెంచుకు పోతోంది. ఈ పరిణామాలు పోలీసులకు సవాలు విసురుతున్నాయి. మరి ఈ అంతరాష్ట్ర దొంగల ముఠాల కట్టడికి పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? 

Tags :

మరిన్ని