Pushpak: ఆర్‌ఎల్‌వీ పుష్పక్‌ ల్యాండింగ్‌ మూడోసారి పరీక్ష విజయవంతం

పునర్వినియోగ వాహకనౌకల సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో వెల్లడించింది.

Published : 23 Jun 2024 18:37 IST

పునర్వినియోగ వాహకనౌకల సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో వెల్లడించింది. ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది. అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లు పేర్కొంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడి భాగాలు, వాటిని మోసుకెళ్లే వాహక నౌకల అభివృద్ధి దిశగా ఇస్రో ఈ ఆర్‌ఎల్‌వీ, ఎల్‌ఈఎక్స్‌ ప్రయోగాలను చేపడుతోంది.

Tags :

మరిన్ని