Modi-Meloni Selfie: మోదీ, మెలోనీ సెల్ఫీ.. ఫోటో వైరల్

ఆ మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సెల్ఫీ దిగారు. ‘మెలోడీ (#Melodi)’ పేరుతో ఆ ఫొటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది.

Published : 15 Jun 2024 16:44 IST

ఆ మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సెల్ఫీ దిగారు. ‘మెలోడీ (#Melodi)’ పేరుతో ఆ ఫొటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. తాజాగా మరోసారి వీరిద్దరూ స్వీయ చిత్రం తీసుకున్నారు. దీంతో ఈ ‘మెలోడీ’ మూమెంట్‌ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. (Modi-Meloni Selfie) ఇటలీ (Italy)లోని అపులియా వేదికగా జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోదీ (PM Modi)కి ఇటలీ ప్రధాని మెలోనీ ‘నమస్తే’ అంటూ సాదర స్వాగతం పలికారు. కొద్ది సేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ (Giorgia Meloni) సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు