TTD: తితిదేలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తా: ఈవో జె.శ్యామలరావు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నూతన ఈవోగా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్నారు.

Published : 16 Jun 2024 19:42 IST

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నూతన ఈవోగా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మాజీ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతలను శ్యామలరావుకు అప్పగించారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా.. జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమీ తీర్థప్రసాదాలు అందజేశారు. ‘‘తితిదే ఈవో కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈవోగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. తితిదేలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తా. తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతా. దర్శనానికి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తాం. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తేవాలి’’ అని ఈవో శ్యామలరావు తెలిపారు.

Tags :

మరిన్ని