Jagan: ఎన్నికల ఫలితాలపై మారని జగన్‌ తీరు!

ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు ఓటు రూపంలో గుణపాఠం చెప్పినా జగన్ తీరు మారడం లేదు.

Published : 21 Jun 2024 14:14 IST

ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు ఓటు రూపంలో గుణపాఠం చెప్పినా జగన్ (Jagan) తీరు మారడం లేదు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో తాడేపల్లి నివాసంలో జగన్ సమావేశమయ్యారు. ఓటమికి కారణాలపై నేతల అభిప్రాయాలు సేకరిస్తే.. తననే లక్ష్యంగా చేసుకుంటారని భావించిన జగన్ దాని జోలికి పోలేదు. ఎప్పటిలాగే అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఇతర పథకాల లబ్ధిదారుల ప్రేమలు ఏమయ్యాయో అంటూ.. వెంట తెచ్చుకున్న స్కిప్టు చదివారు.

Tags :

మరిన్ని