Jeevan Reddy: ఆత్మగౌరవమే ముఖ్యం అయినా.. కాంగ్రెస్‌ను వీడను: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తనతో చర్చించకుండానే జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర మనస్తాపం చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

Updated : 25 Jun 2024 20:41 IST

తనతో చర్చించకుండానే జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర మనస్తాపం చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తానూ ఏ పార్టీలో చేరనని కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డిని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహా పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. సీనియర్ నేతల్ని వదులుకోవడానికి సిద్ధంగాలేమని వారు బాధపడితే తాము బాధపడతామన్నారు. ఐతే.. తనకు ఆత్మగౌరవమే ముఖ్యమన్న జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై విభేదిస్తున్నామని తేల్చిచెప్పారు.

Tags :

మరిన్ని