Jeevan Reddy: కాంగ్రెస్‌లో భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై జీవన్‌ రెడ్డి అసంతృప్తి

జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్‌లో అసంతృప్తిని రాజేసింది.

Published : 25 Jun 2024 10:14 IST

జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్‌లో అసంతృప్తిని రాజేసింది. కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పార్టీలో చేర్చుకున్నారని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టితీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు, విప్ ఆది శ్రీనివాస్ సహా ఎమ్మెల్యేలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయం ఉంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని