Biden-Trump: చర్చకు ‘ట్రంప్‌-బైడెన్‌’ సిద్ధం

జోబైడెన్‌-డొనాల్డ్ ట్రంప్(Biden-Trump) మధ్య తొలి చర్చకు రంగం సిద్ధం అవుతోంది. ఈ వారంలో వారిద్దరు ముఖాముఖిగా తలపడనున్నారు. 

Published : 25 Jun 2024 11:07 IST

నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిమిత్తం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Biden-Trump) వాడీవేడీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరు ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్‌ 27న మొదటిసారి వారి మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్‌ ఎఫ్ కెన్నడీ ఈ డిబేట్‌కు అర్హత సాధించలేదు. 

Tags :

మరిన్ని