Nara Lokesh: మంత్రి లోకేశ్‌ చొరవతో దివ్వాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు

జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీటు దక్కినా.. ఐఐటీ మద్రాస్‌ తెచ్చిన కొత్త నిబంధనలతో ప్రవేశాలు కోల్పోతున్న దివ్యాంగులకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ సత్వర చొరవతో న్యాయం జరిగింది.

Updated : 08 Jul 2024 14:15 IST

జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీటు దక్కినా.. ఐఐటీ మద్రాస్‌ తెచ్చిన కొత్త నిబంధనలతో ప్రవేశాలు కోల్పోతున్న దివ్యాంగులకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ సత్వర చొరవతో న్యాయం జరిగింది. మార్కుల మెమోలను సవరించి ఇవ్వడమే కాకుండా.. అందుకు అనుగుణంగా జీవో జారీ చేయించడంతో రాష్ట్రానికి చెందిన సుమారు 25 మంది విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందే అవకాశం దక్కింది. తమ సమస్యను తెలుసుకొని వెంటనే పరిష్కరించిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ విద్యాసంస్థల్లో సీటు తెచ్చుకున్న ఆ విద్యార్థులనూ సోమవారం లోకేశ్‌ అభినందించనున్నారు.

Tags :

మరిన్ని