TS News: కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు!

కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరో రెండునెలలు పొడగించనున్నట్లు సమాచారం.

Published : 13 Jun 2024 09:43 IST

కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరో రెండునెలలు పొడగించనున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగి పియర్స్, గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో న్యాయ విచారణ కమిషన్‌ను నియమించింది. వంద రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్‌ ఆఖరుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్‌ తదితర కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరడంతో పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది.

Tags :

మరిన్ని