CM Revanth Reddy: విద్యార్థుల భావోద్వేగాలతో కేసీఆర్ రాజకీయం: సీఎం రేవంత్‌ రెడ్డి

పార్టీ బలహీనపడినప్పుడల్లా కేసీఆర్‌ విద్యార్థుల భావోద్వేగాలతో శవ రాజకీయం చేసి పార్టీని నిర్మించుకోవాలని చూస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

Published : 09 Jul 2024 21:37 IST

పార్టీ బలహీనపడినప్పుడల్లా కేసీఆర్‌ విద్యార్థుల భావోద్వేగాలతో శవ రాజకీయం చేసి పార్టీని నిర్మించుకోవాలని చూస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోటీ పరీక్షలు వాయిదా వేయాలనే వాదనలో బలం ఉంటే కేటీఆర్‌, హరీశ్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్ విసిరారు. కోచింగ్ సెంటర్ల మాఫియా రూ.వందల కోట్లు కొల్లగొట్టేందుకు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించిందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నప్పుడు రాజనీతి, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడపోయాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

Tags :

మరిన్ని