KCR: రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌ ఏర్పాటు!: కేసీఆర్‌ వివరణ

విద్యుత్‌ కొనుగోలు విషయంలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు వివరణ ఇచ్చారు. కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు.

Published : 15 Jun 2024 14:02 IST

విద్యుత్‌ కొనుగోలు విషయంలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు వివరణ ఇచ్చారు. కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు. అన్ని రకాల చట్టాల నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్నారు. ఈ విషయం కూడా రేవంత్ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిటీ ఏర్పాటు చేశారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పారు. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయే పరిస్థితి ఉండేదని వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు