Amritpal Singh: జులై 5న ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృత్‌పాల్ సింగ్‌

ఖలిస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) జులై 5 లోక్‌సభ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మరో ఎంపీ సరభ్‌జీత్‌ సింగ్ ఖల్సా వెల్లడించారు. 

Published : 04 Jul 2024 10:33 IST

ఖలిస్థానీ నేత, వారిస్‌ పంజాబ్‌దే అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని ఫరీద్‌కోట్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ సరబ్‌జీత్ సింగ్ ఖల్సా తెలిపారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అసోంలోని డిబ్రూగఢ్‌ జైలులో ఉన్న అమృత్‌పాల్‌కు ప్రమాణ స్వీకారం కోసం వివిధ శాఖల నుంచి అనుమతి వచ్చినట్టు వెల్లడించారు.

Tags :

మరిన్ని