Vijayawada: రూ.30 లక్షలు ఇస్తామని ఆశ చూపి.. విజయవాడలో కిడ్నీ కొట్టేసిన ముఠా!

విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగు చూశాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే.. కిడ్నీ తీసుకుని తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Published : 08 Jul 2024 16:39 IST

విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగు చూశాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే.. కిడ్నీ తీసుకుని తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని చెప్పి.. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తయ్యాక ఖర్చులకు రూ.1.10లక్షలు మాత్రమే ఇచ్చారని వాపోయారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే అమాయకులకు డబ్బు ఆశ చూపి నెలకు 5- 10 మందికి మూత్రపిండాల ఆపరేషన్లు చేస్తున్నారని మధుబాబు ఆరోపించారు. 

Tags :

మరిన్ని