Fire Accident: చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం.. రూ.50లక్షల పాదరక్షలు, ముడిసరకు దగ్ధం

పురానీ హవేలీలోని ఎస్‌కే ఫుట్‌వేర్‌ షాప్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.50లక్షల విలువ చేసే పాదరక్షలు, ముడిసరకు దగ్ధమైంది.

Published : 12 Jun 2024 19:53 IST

చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం.. రూ.50లక్షల పాదరక్షలు, ముడిసరకు దగ్ధం

పురానీ హవేలీలోని ఎస్‌కే ఫుట్‌వేర్‌ షాప్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.50లక్షల విలువ చేసే పాదరక్షలు, ముడిసరకు దగ్ధమైంది. సమాచారం అందగానే మీర్‌చౌక్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. చెప్పుల దుకాణం కావటంతో మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Tags :

మరిన్ని