Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

మహరాష్ట్ర ఠాణె జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డోంబివిలిలో బుధవారం ఉదయం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Published : 12 Jun 2024 16:57 IST

మహరాష్ట్ర ఠాణె జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డోంబివిలిలో బుధవారం ఉదయం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో ఫ్యాక్టరీ కార్మికులు పరుగులు తీశారు. దట్టంగా పొగలు కమ్ముకొని భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

Tags :

మరిన్ని