China: చైనాలో వరద బీభత్సం.. నీట మునిగిన పట్టణాలు, గ్రామాలు

దక్షిణ చైనాలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. నదులు మహోగ్ర రూపం దాల్చాయి.

Published : 14 Jun 2024 17:17 IST

దక్షిణ చైనాలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. నదులు మహోగ్ర రూపం దాల్చాయి. అనేక పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. వరదల కారణంగా రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు పడిపోయి వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. స్థానిక ప్రభుత్వ అధికారులు, సిబ్బంది.. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఫుజియాన్‌లోని ఓ కౌంటీలో ఉన్న 1700 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Tags :

మరిన్ని